Navjot Sidhu Work In Patiala Jail: జైలులో నవజోత్‌సింగ్‌ సిద్ధూకు వర్క్‌ అలాట్‌.. పని ఏంటంటే..?

Navjot Sidhu Work As Clerk In Patiala Jail - Sakshi

కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూ పాటియాలలోని సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 1998లో జరిగిన ఓ దాడికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది. 

ఇదిలా ఉండగా.. తాజాగా సిద్ధూకు జైలు అధికారులు క్లర్క్‌ పనిని అప్పగించినట్టు జైలు అధికారులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్లర్క్‌గా ఆయన ఏ పని చేయాలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శిక్షణ అనంతరం సిద్ధూ పూర్తి స్థాయిలో ఆ పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జైలు రికార్డులను పరిశీలించడం, సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను పర్యవేక్షించడం వంటివి చేయాల్సి ఉంటుంది. 

ఇదిలా ఉండగా.. శిక్షణ ఇచ్చిన తర్వాత జైలు రూల్స్‌ ప్రకారం.. మూడు నెలల పాటు వేతనం చెల్లించరు. శిక్షణ ముగిసిన తర్వాత స్కిల్‌ను బట్టి రోజుకు రూ. 40-90 వరకు వేతనం అందిస్తారు. ఇక, సిద్ధూ.. హై ప్రొఫైల్ ఖైదీ కావడంతో బరాక్ నుంచే క్లర్క్ పనులను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ నుంచి బయటకు రాకుండా ఆయన దగ్గరకే రికార్డులు పంపించనున్నారు. సిద్ధూ ఉండే సెల్ సమీపంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. సిద్ధూకు ఖైదీ నంబర్ 241383, బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్‌ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్‌ ఇది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top