బైడెన్‌కు మోదీ శుభాకాంక్షలు | Narendra Modi Congratulates Joe Biden And Kamala Harris | Sakshi
Sakshi News home page

Nov 18 2020 8:30 AM | Updated on Nov 18 2020 8:31 AM

Narendra Modi Congratulates Joe Biden And Kamala Harris - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళ కమల హ్యారిస్లకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి నేతృత్వంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత పురోగమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాగుతుం దని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపాను. కోవిడ్, వాతావరణ మార్పు సహా ఇరుదేశాలు ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై చర్చించాను’ అని మోదీ మంగళవారం ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం తర్వాత ప్రధాని ఇరువురు నేతలకు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. (చదవండి: ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement