‘మోదీ 3.0’కు 11 ఏళ్లు.. ఈ ఏడాది మైలురాళ్లివే.. | Modi 3.0 is 11 years old; This year marks milestones | Sakshi
Sakshi News home page

‘మోదీ 3.0’కు 11 ఏళ్లు.. ఈ ఏడాది మైలురాళ్లివే..

Jun 9 2025 9:55 AM | Updated on Jun 9 2025 10:32 AM

Modi 3.0 is 11 years old; This year marks milestones

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వానికి నేటితో(జూన్‌ 9) ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ  ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్‌ భారత్‌కా అమృత్ కాల్’ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్ ,  వక్ఫ్ సంస్కరణలు, ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవలే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పాలన, పరివర్తనే లక్ష్యంగా ముందుకువెళుతున్నామన్నారు.
 

140 కోట్ల భారతీయుల ఆశీస్సులతో వివిధ రంగాల్లో వేగవంతమైన మార్పు సాధించామని, ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే సూత్రంతో తమ ప్రభుత్వం అద్భుతమైన మార్పులను అందించిందని, ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక ఉన్నతి వరకు, ప్రజాకేంద్రీకృత, సమగ్ర, సర్వతోముఖ అభివృద్ధిపై దృష్టి సారించామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, వాతావరణ మార్పులు , డిజిటల్ ఆవిష్కరణల వంటి కీలక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక గొంతుకగా మారిందని ప్రధాని అన్నారు. 
సమిష్టి విజయంపై గర్విస్తూనే, ఆశ, విశ్వాసం, సంకల్పంతో వికసిత భారత్ నిర్మాణం వైపు ముందుకు వెళతున్నామని ప్రధాని మోదీ ఆ ట్వీట్‌లో పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్‌ లేఖ.. ఏమన్నారంటే..  

Advertisement
 
Advertisement
Advertisement