అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు

Mob Attack On CPI M Office Bhanu Smriti Bhavan In Agartala - Sakshi

అగర్తల: కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) కార్యాలయంపై దుండగులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అనంతరం నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా త్రిపుర రాజధాని అగర్తలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్‌పై బుధవారం సాయంత్రం కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డాయి. ఆ భవనంతో పాటు పక్కనే ఉన్న దశరథ్‌ భవన్‌ను కూడా నిప్పు పెట్టారు. అక్కడ కనిపించిన వాహనాలను కూడా దగ్ధం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది బీజేపీ అని సీపీఎం ఆరోపిస్తోంది. బీజేపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే బీజేపీ వాటిని తిప్పికొట్టింది. వారి పార్టీ కార్యాలయాల్లో బాంబులు ఉన్నాయని, అవి పేలడంతో నిప్పు చెలరేగిందిన బీజేపీ ఆరోపిస్తోంది.
చదవండి: గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top