ఆదర్శం.. వరి కోత కోస్తున్న మంత్రి

Minister Padmini Dian Doing Agriculture Harvesting In Odisha - Sakshi

సాక్షి, జయపురం: అవిభక్త కొరాపుట్‌ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా శాసనసభలో అడుగిడిన పలువురు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు వారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా తమ అసలైన జీవితాన్ని ఎన్నడూ మరువలేదని పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. ఇటీవల నవరంగపూర్‌ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి నాగలి పట్టి పొలం దున్ని వ్యవసాయం చేసిన ఫొటోలు సోషల్‌ మీడియా, వార్తా పత్రికలలో ప్రజలను ఆకర్షించాయి. నేడు అటువంటి మరో సంఘటన జిల్లా ప్రజలను ఆకట్టుకుంది.

కొరాపుట్‌ జిల్లా కొట్‌పాడ్‌ శాసనసభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి అలంకరించిన పద్మిని ధియాన్‌ కొట్‌పాడ్‌ సమితిలోని దమనహండి గ్రామంలో గల తమ సొంత పొలంలో పండిన వరి చేనును బుధవారం స్వయంగా కొడవలి పట్టి ఇతరులతో కలిసి  కోశారు. గతంలో తమతో పాటే పొలం పనులు చేసినా మంత్రి అయిన తరువాత కూడా ఆమె హోదాను పక్కన పెట్టి కొడవలి పట్టి వరి చేను కోయడం ఆమె నిరాడంబరతకు దర్పణం పడుతోందని ఆ ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు. చదవండి: (వైరల్‌ వీడియో.. పోలీసుపై ప్రశంసలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top