పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!

Meghalaya Whistling Village Kongthong Interesting Story - Sakshi

సాధారణంగా ఎవరినైనా పిలవాలంటే వారి పేర్లతో పిలుస్తాం. అది వాళ్ల సొంత పేరు కావచ్చు లేదా ముద్దు పేరు కావచ్చు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే అభిమానులు పిలుచుకునే పేర్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది పేరు లేకుండా ఓ మనిషిని పిలవగలమా అంటే కుదురుతుంది అంటున్నారు మేఘాలయలోని ఓ గ్రామ నివాసితులు. అదెలా అనుకుంటున్నారా.. ఎందుకుంటే వాళ్లు ఆ ప్రాంతంలో పేర్లు లేకుండానే కేవలం విజిల్స్‌తోనే కమ్యూనికేట్‌ చేసుకుంటారట! 
అసలా కథేంటంటే..         
ఆ ఊరి పేరు కాంగ్‌థాన్‌.  ఆ ఊరిలో సుమారు 700 వందలకు పైగా ప్రజలు నివసిస్తుంటారు. మేఘాలయాలోని ఈస్ట్‌ ఖాసి జిల్లాలో ఉంది. ఆ ప్రాంత ప్రజలకు ఈల వేయడం ఆచారం. అది గత నెలనో లేదా గత సంవత్సరం నుంచి పాటిస్తోంది కాదు వారి పూర్వీకులనుంచి సంప్రదాయంగా వస్తోందట. అసలు కొత్తవాళ్లు ఆ ఊరికి వెళ్తే వాళ్ల ఆచారాలు చూసి ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే సీటీ (విజిల్‌), పక్షుల అరుపులు, సినిమా పాటల్లోని ట్యూన్ల ఆధారంగా పిల్లలకు పేర్లు పెడుతుంటరు ఇక్కడ. అందుకే ఆ గ్రామాన్ని విజిల్‌ గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి గ్రామస్తులు ఒకరినొకరు ప్రత్యేకమైన రాగంతో పిలుచుకుంటారు. ఒకరినొకరు పిలుచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో రాగంఉంటుందట. గ్రామస్తులు ఈ ట్యూన్‌ని ‘జింగ్‌ర్‌వై లాబీ’ అని పిలుస్తారు, అంటే తల్లి ప్రేమ పాట అని అర్థం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top