
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్ర: వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన ప్రియుడు మోసగించాడని మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. యశోద ఆత్మహత్య చేసుకొన్న మహిళ. మృతురాలు యశోదకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఆమె పక్క వీధిలో ఉన్న ఆడిటర్ విశ్వనాథ్ అనే వ్యక్తితో గత తొమ్మిదేళ్లుగా అక్రమ సంబంధం కలిగి ఉంది. అయితే కొంతకాలం క్రితం యశోద తన స్నేహితురాలిని ప్రియుడు విశ్వనాథ్‌కి పరిచయం చేసింది.
దీంతో ప్రియుడు యశోద స్నేహతురాలితో చనువు పెంచుకొని ఆమెను ప్రేమ వలలో పడేశాడు. అంతేకాకుండా ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. ఈ విషయం యశోద చెవిలో పడింది. ప్రియుడితో కలిసి స్నేహితురాలు ఉన్న లాడ్జికి వెళ్లి గొడవ పడింది. ప్రియుడు సరిగా స్పందించకపోవటంతో మనోవేదనతో అక్కడే పక్క గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మాగడి రోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.