మహారాష్ట్రలో దారుణం.. సమాజం ఎటు పోతోంది! | Maharashtra Woman Physically Assaulted And Attacked With Sharp Weapon | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో దారుణం.. సమాజం ఎటు పోతోంది!

Dec 4 2022 5:37 PM | Updated on Dec 4 2022 5:53 PM

Maharashtra Woman Physically Assaulted And Attacked With Sharp Weapon - Sakshi

మహారాష్ట్రలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 

దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోట కొందరు మృగాలు రెచ్చిపోతూ దారుణాలను పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం.. పైశాచికత్వం ప్రదర్శించారు. 

వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. కాగా, బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి ముగ్గురు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం, ఆమెను కత్తిలో బెదిరించారు. ఈ క్రమంలోనే ఆమెపై ముగ్గురు యువకులు.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అకృత్యానికి పాల్పడుతూనే మహిళ పట్ల పైశాచికత్వం ప్రదర్శించారు. 

లైంగిక దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రైవేటు భాగాలపై సిగరెట్‌తో కాల్చుతూ రక్షసానందం పొందారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో చేశారు. అనంతం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరింపులకు గురి చేశారు. కాగా, బాధితురాలు తనకు జరిగిన అన్యాయం మరొకరి జరగొద్దనే కారణంతో ఎన్జోవోలను ఆశ్రయించింది. దీంతో, నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement