అయ్యో పాపం.. ప్లాస్టిక్ దారంతో విలవిల్లాడిన అడవి కుక్క

మైసూరు: ప్లాస్టిక్ వల్ల జీవజాలం మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. మైసూరు సమీపంలోని నారగహోళె అడవిలో ఒక అడవి కుక్క మెడకు దారం చుట్టుకుని మెడభాగం దాదాపు తెగిపోయే స్థితిలో ఉంది. అంతలో అటవీసిబ్బంది దానిని పట్టుకుని చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రపంచంలోనే అరుదైన అడవి కుక్కలు నాగరహోళె అడవుల్లో కనిపిస్తాయి.
వీటిపై పలు అంతర్జాతీయ చానెళ్లలో కథనాలు కూడా వచ్చాయి. ఇటీవల కుక్కల గుంపు తిరుగుతుండగా ఒక కుక్క మెడకు ప్లాస్టిక్ దారం చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. మృత్యువు అంచుల్లో ఉన్న దానిని అటవీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని దారాన్ని తొలగించి వైద్యం చేయించారు.