35 ఏళ్ల ప్రస్థానం.. కారు, డ్రైవర్‌కి ఒకేసారి వీడ్కోలు

Last Ambassador Car Of Central Railways Mumbai Division Retired - Sakshi

ముంబై సెంట్రల్‌: ఒకప్పుడు ధనవంతుల వా హనంగా, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహ నంగా ప్రసిద్ధి పొందిన అంబాసిడర్‌ కారుకు మధ్య రైల్వేకు చెందిన ముంబై విభాగం తుది వీడ్కోలు పలికింది. కారుతోపాటు ఆ కారును 35 సంవత్సరాలుగా నడిపిస్తున్న డ్రైవర్‌ కూడా ఉద్యోగం నుండి రిటైర్‌మెంట్‌ పొందారు. 35 సంవత్సరాలుగా మధ్య రైల్వేలో సేవలందిస్తూ, ఇంతకాలం మిగిలి ఉన్న ఏకైక అంబాసిడర్‌ వాహనాన్ని స్క్రాప్‌ చేయాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఆ కారును పూలదండలతో అలంకరించి, మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు.

కరీరోడ్‌ డిపోలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.  సెంట్రల్‌ రైల్వే సేవలలో మిగిలిఉన్న ఒకేఒక్క ఈ అంబాసిడర్‌ కారు 1985, జనవరి 22న రైల్వే సేవల్లోకి ప్రవేశించింది. అప్పట్నుంచి ఈ కారుకు డ్రైవర్‌గా ముత్తు పాండీ నాడార్‌ కొనసాగుతూ, కారుతో పాటే ఆయన కూడా మంగళవారం రిటైర్‌ కావడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్‌ ఉంటేనే ప్రవేశం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top