అరుదైన రికార్డు సాధించిన కేరళ యువకుడు

Kerala Man Makes World Biggest Marker Pen Posts Video - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కర్‌ పెన్నును తయారు చేశాడో యువకుడు. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన ముహమ్మద్‌ దిలీఫ్‌ గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తనపేరు లిఖించుకోవడానికి ఒక భారీ మార్కర్‌ పెన్నును తయారు చేసి తను అనుకున్నది సాధించాడు. అయితే గిన్నీస్‌ అధికారులు.. దానిని రాయడానికి ఎలా ఉపయోగించాలో చూపించే ఒక వీడియోను మనతో పంచుకున్నారు.

'ప్రపంచంలో అతిపెద్ద మార్కర్‌ను తయారుచేయడం, దానిని ఉపయోగించే అవకాశం రెండూ కూడా భారత్‌కు చెందిన ముహమ‍్మద్‌ దిలీఫ్‌కు లభించాయి' అంటూ వీడియోతో పాటు పంచుకున్న క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఇదే వీడియోలో దిలీఫ్‌, అతనితో పాటు మరికొందరు 2.745మీ x 0.315 మీ పరిమాణం గల పెన్నును తయారుచేయడం చూడవచ్చు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సైట్‌ ప్రకారం.. ఈ ఏడాది  సెప్టెంబర్‌ 5న ఈ రికార్డును సృష్టించారు.   (దివాలి బోనస్‌పై ఆశలు.. జోకులు)

అయితే దిలీఫ్‌ పోస్ట్‌ చేసిన ఇదే వీడియోకు 'కొత్త తరాన్ని చదవడానికి ప్రేరేపించండి, ప్రోత్సహించండి' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు అధికారుల ద్వారా నవంబర్‌ 10న పోస్ట్‌ చేయబడిన ఈ వీడియో వేల సంఖ్యలో లైకులు, కామెంట్లతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కొందరు నెటిజన్లు దిలీఫ్‌ 'సృజనాత్మకత'ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరో నెటిజన్‌ 'ఇది అవెంజర్స్‌ కోసం తయారు చేసింది' అంటూ చమత్కరించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top