దీపావళి బోనస్‌.. మీమ్స్‌

Diwali Bonus Memes Trending In Twitter - Sakshi

కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలయ్యింది. కరోనా చేసిన నష్టాన్ని భర్తి చేసేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, జీతాలలో కోతలు పెడుతున్నాయి. ప్రతి సంవత్సరం కంపెనీలు ఎంప్లాయిస్‌కి దివాలి సమయంలో బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈ సారి బోనస్‌ ఇచ్చే పరిస్థితి లేకపోయినా ఎంప్లాయిస్‌ మాత్రం బోనస్‌లపై ఆశ పెట్టుకున్నారు. దివాలి బోనస్‌పై సెటైరికల్‌ ఫొటోలు, కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు. దివాలి బోనస్‌పై వస్తున్న సెటైరికల్‌ పోస్ట్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటమే కాక మంచి సరదాను ఇస్తున్నాయి.

ట్విటర్‌లో నెటిజన్లు సినిమా తారల చిత్రాలను వాడుతూ, కొద్దిగా సరదా వ్యాఖ్యలు జోడించడంతో నవ్వులు పూయిస్తున్నాయి. కంపెనీల బోనస్‌ విషయం పక్కన పెడితే వీటిపై వస్తున్న పోస్ట్‌లు మాత్రం ట్విటర్‌లో నిండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ తమ ఎంప్లాయిస్‌కి బోనస్‌ ప్రకటించాయి. ఇలాంటి సమయంలో కంపెనీలు ఎంప్లాయిస్‌కి బోనస్‌ ఇచ్చినా, ఇవ్వకపోయిన సోషల్‌ మీడియాలో మాత్రం మీమ్స్‌తో సరదా తెస్తున్నారు. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న పలు మీమ్స్‌ మీకోసం.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top