టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు ఓకే  | Karnataka High Court Gives Nod To Conduct SSLC Exam | Sakshi
Sakshi News home page

Covid 19: టెన్త్‌ పరీక్షలకు కర్ణాటక హైకోర్టు ఓకే 

Jul 13 2021 10:15 AM | Updated on Jul 13 2021 10:23 AM

Karnataka High Court Gives Nod To Conduct SSLC Exam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి/బెంగళూరు: రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్‌) పరీక్షల నిర్వహణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షల్ని రద్దు చేయాలని సింగ్రిగౌడ అనే వ్యక్తి వేసిన అర్జీని న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, సంజీవ్‌కుమార్‌ల బెంచ్‌ కొట్టివేసింది. అందరినీ పాస్‌ చేయడం, మార్కుల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని హైకోర్టుకు ఏజీ ప్రభులింగ వివరించారు. కోవిడ్‌ వైరస్‌ తగ్గడంతో పరీక్షలు నిర్వహించవచ్చని, వారి ఉత్తమ భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

అదే విధంగా... ఒకవేళ ఈ ఏడాది రాయకపోతే వచ్చే ఏడాది రాయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.48 శాతంగా ఉన్నందున కోవిడ్‌ నియమాలను పాటిస్తూ పరీక్షల్ని నిర్వహించాలన్నారు. కానీ బలవంతంగా విద్యార్థుల చేత పరీక్షలు రాయించరాదని తెలిపారు. కాగా, ఈ నెల 19 నుంచి 22 వరకు రెండు రోజుల్లో పరీక్షలను నిర్వహించాలని విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement