భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం: ఉపరాష్ట్రపతి | Jagdeep Dhankhar India can't afford to be divided over languages | Sakshi
Sakshi News home page

భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం: ఉపరాష్ట్రపతి

Jun 18 2025 7:49 AM | Updated on Jun 18 2025 9:44 AM

Jagdeep Dhankhar India can't afford to be divided over languages

పుదుచ్చేరి: ప్రపంచంలోనే ఆదర్శప్రాయమైన మన దేశం భాషల విషయంలో విభజనకు గురవడం భరించలేని విషయమని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని, అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ)–2020 అమలు దేశ విద్యారంగానికి మేలిమలుపు వంటిదని ఆయన అభివర్ణించారు. 

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ మంగళవారం పాండిచ్చేరి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ‘ఎన్‌ఈపీ ఏదో ఒక ప్రభుత్వ విధానం కాదు. అన్ని భాషలకు సముచిత స్థానం కల్పిస్తూ మన యువత శక్తిసామర్థ్యాలను ప్రతిభను చాటుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తుంది’అని పేర్కొన్నారు. భాషలను బట్టి వేరుగా ఉందామా?అని ప్రశ్నించారు. హిందీని తమపై రుద్దే ఎన్‌ఈపీని కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అమలు చేయడాన్ని వ్యతిరేకించే వారిని ఉద్దేశించి ఆయనీ మాటలన్నారు. పార్లమెంట్‌లో సభ్యులు 22 భాషల్లో మాట్లాడే అవకాశముందని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతలు మనకు బోధించినవి గందరగోళానికి, ఘర్షణలకు, అవాంతరాలకు తావులేని విధానాలన్న విషయాన్ని రాజకీయ నాయకత్వాలు గుర్తుంచుకోవాలని పరోక్షంగా అధికార పార్టీ డీఎంకేకు ఆయన సూచించారు.  

Advertisement
 
Advertisement
Advertisement