ఈనెల 7న ఎస్‌ఎస్‌ఎల్‌వీ తొలి ప్రయోగం | Sakshi
Sakshi News home page

SSLV: ఈనెల 7న ఎస్‌ఎస్‌ఎల్‌వీ తొలి ప్రయోగం

Published Tue, Aug 2 2022 4:32 AM

ISRO To Undertake Maiden Flight Of SSLV On August 7 - Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ, విదేశీ సంస్థలతో పాటు, విద్యార్థులు తయా­రుచేసే చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎస్‌ఎల్‌వీని రూపొందించింది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 75  జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ అనే ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ ద్వారా తొలిసారిగా అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మీ ఫోన్‌ రిపేర్‌ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త!

Advertisement
Advertisement