వచ్చే ఏడాది చంద్రయాన్‌-3 ప్రయోగం : ఇస్రో

ISRO Says Launching Of Chandrayaan-3 From Benguluru By Next Year - Sakshi

బెంగళూరు : చంద్రునిపై పరిశోధనలో భాగంగా చంద్రయాన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్‌ 1, చంద్రయాన్‌ 2లను ప్రయోగించిన ఇస్రో తాజాగా చంద్రయాన్‌ 3 ప్రయోగానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది మొదట్లో చంద్రయాన్‌ 3 నిర్వహించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బెంగళూరుకు 215 కిమీ దూరంలో ఉన్న చల్లాకేరెలోని ఉల్లార్తి కావల్లో ఇస్రో ప్రయోగం చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్‌ పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది.

సెప్టెంబర్‌ చివరి కల్లా చంద్రయాన్‌ లో ఉపయోగించనున్న మూన్‌ క్రెటర్‌కు సంబంధించిన టెండరింగ్‌ పనులు పూర్తవుతాయని తెలిపింది. కాగా మూన్‌ క్రెటర్‌ వ్యయం రూ. 24.2 లక్షలు కానున్నట్లు పేర్కొంది. చంద్రయాన్‌ 3కి ఉపయోగించనున్న క్రెటర్‌ 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉండనుంది. చంద్రయాన్‌ 3లో ఉయోగించనున్న సెన్సార్స్‌ చంద్రుని వైపు వేగంగా సాగేందుకు కక్క్ష్యలో ల్యాండర్‌ సెన్సార్‌ పరికరాలను అమర్చినట్లు తెలిపింది. దీనికి ఇప్పటికే ల్యాండర్‌ సెన్సార్‌ పర్‌ఫార్మెన్స్‌ టెస్ట్‌(ఎల్‌పీటీ) కూడా నిర్వహించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top