మా ప్రజలు హింసకు గురవుతుంటే అలా వదిలేయ లేం: Rahul Gandhi

Indians Stuck In Ukraine Rahul Gandhi Post Video In Twitter - Sakshi

Indians Stuck In Ukraine: ఉక్రెయిన్ సంక్షోభంపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తరలింపు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ప్రధానమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు తరలింపు ప్రయత్నాల మధ్య సుమారు 2 వేల మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చినట్లు కూడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అయితే ఇంకా కొంతమంది విద్యార్థులు ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద చిక్కుకుపోయారు.

అంతేకాదు ఆ సరిహద్దు వద్ద ఉన్న గార్డులు భారతీయ విద్యార్థులను హింసకు గురిచేస్తున్నారు. అమ్మాయిలని కనికరం కూడా లేకుండా దారుణంగా కొడుతున్నారు. కొంతమంది విద్యార్థులను సరిహద్దుల నుంచి నెట్టివేయడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానూ, గందరగోళంగానూ ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆయన అక్కడ పరిస్థితిపై ఆందోళన చెందుతూ దయచేసి ప్రభుత్వం త్వరితగతిన భారతీయ విద్యార్థులను తరలించాలని కోరారు. హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థులు వారి కుటుంబాలను చూస్తుంటే హృదయం విలవిలాడిపోతుందని అన్నారు.

అంతేకాదు తరలింపు చర్యలు మరింత ముమ్మరంగా సాగించాలని ప్రభుత్వానికి విజ‍్క్షప్తి చేశారు. నివేదికల ప్రకారం విద్యార్థులు పోలాండ్ దాటడానికి ప్రయత్నించినప్పుడు వేధింపులకు గురవుత్ను వీడియో అని తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, కేంద్ర ప్రభుత్వం గత వారం హంగరీ, పోలాండ్, రొమేనియ, స్లోవేకియా రిపబ్లిక్ సహాయంతో ప్రత్యామ్నాయ తరలింపు ప్రణాళికలను రూపొందించింది. పైగా సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవద్దని ప్రభుత్వం ఒక ప్రకటనలో విద్యార్థులకు తెలిపింది కూడా.

(చదవండి: యుద్ధ ట్యాంక్‌ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top