మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు | Sakshi
Sakshi News home page

మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు

Published Sun, Jan 7 2024 4:59 PM

Indians Cancel Maldives Trips Amid Row Over Island Minister Post - Sakshi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద ట్వీట్‌పై వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రి చేసిన వివాదాస్పద ట్వీట్‌పై భారత నెటిజన్లు భగ్గుమంటున్నారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు టూర్‌లను రద్దు చేసుకున్న టికెట్‌ క్లిప్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

ఫిబ్రవరి 2న వచ్చే నా పుట్టినరోజు కోసం మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. నా ట్రావెల్ ఏజెంట్‌తో దాదాపుగా డీల్‌ని ఖరారు చేశాను. 
అయితే మాల్దీవుల డిప్యూటీ మినిస్టర్ చేసిన ఈ ట్వీట్ చూసిన వెంటనే క్యాన్సిల్ చేసుకున్నాను. 

  

లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు.

భారత్ పర్యాటకాన్ని మాల్దీవుల పర్యాటకంతో పోల్చుతూ ఆ దేశ మంత్రులు హేళనగా పోస్టులు చేశారు. దీనిపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా  వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు.

భారతదేశం, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికంగా మార్పు కనిపించింది. మునుపటి "ఇండియా ఫస్ట్" విధానం నుండి వైదొలగనున్నట్లు సూచనలు ఇచ్చారు.  చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవులు, భారతదేశం 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ' వంటి విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం

Advertisement

తప్పక చదవండి

Advertisement