తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణం!

Indian Railways is launching AC 3-tier economy coach - Sakshi

థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌ సిద్ధం

సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌లను కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది.

రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్‌ అమర్చారు. చదివేటపుడు తగిన వెలుతురొచ్చేలా ప్రతి బెర్త్‌ వద్ద లైట్లు ఏర్పాటుచేశారు. బెర్త్‌ వద్ద మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి తెచ్చారు. మధ్య, ఎగువ బెర్త్‌లకు చేరుకునేందుకు అనుకూల డిజైన్‌తో నిచ్చెనలు రూపొందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top