breaking news
low fares
-
చార్జీల భారం తగ్గించేలా భారత్ ట్యాక్సీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల రైడ్–ఆధారిత మొబైల్ యాప్‌ల అధిక చార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ యాప్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీల అధిక చార్జీల మోత నుంచి ఇటు ప్రయాణికులకు విముక్తి కల్పిస్తూనే డ్రైవర్లకు సైతం అధిక లాభాలు ఒనగూరేలా యాప్‌ను డిజైన్చేస్తున్నట్లు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం వెల్లడించారు. ‘‘ సహకారసంస్థల దన్నుతో బైకులు, ఆటోలు, కార్లలో వినియోగించేలా రైడ్–ఆధారిత మొబిలిటీ యాప్‌ను తీసుకురావాలని ప్రతిపాదించాం.ప్రయాణికులు ఎంతో సులభంగా రైడ్ బుక్ చేసుకునేలా యాప్ డిజైన్ ఉంటుంది. చార్జీల్లో పారదర్శకత, వాహన ట్రాకింగ్, సందేహాలు నివృత్తిచేసేందుకు పలు భాషల్లో 24 గంటలూ సేవలందించే కస్టమర్‌కేర్ సౌకర్యం, భద్రత, సురక్షణల వంటి ఎన్నో ఫీచర్లతో యాప్‌ను సిద్ధంచేస్తాం. ఈ యాప్‌లో సంస్థ కమిషన్ అనేది సున్నా. అందుకే డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ కోతలు లేకుండా నేరుగా భారీ ప్రయోజనం చేకూరుతుంది. కోఆపరేటివ్ సొసైటీకొచ్చే ఆదాయం నేరుగా డ్రైవర్లకే చేరుతుంది. తక్కువ చార్జీల కారణంగా ప్రయాణికులకు సైతం సొమ్ము ఆదా అవుతుంది.అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు లబ్ధిచేకూరేలా ధరల శ్రేణి ఉంటుంది’’ అని అమిత్ షా అన్నారు. ‘భారత్ ట్యాక్సీ’ డిజిటల్ యాప్‌ను సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ దన్నుతో పలు కేంద్ర, రాష్ట్ర, డ్రైవర్ల సహకార సంఘాలు ఇందులో వాటాదారులుగా ఉన్నాయి. రాష్ట్రాల సహకార సొసైటీల చట్టం–2002 కింద ఈయాప్‌ను 2025 జూన్ ఆరోతేదీన నమోదుచేశారు. డ్రైవర్లు సైతం ఈ సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్లో భాగస్వాములుగా ఉండటం విశేషం. ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. -
తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణం!
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌లను కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్ అమర్చారు. చదివేటపుడు తగిన వెలుతురొచ్చేలా ప్రతి బెర్త్ వద్ద లైట్లు ఏర్పాటుచేశారు. బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెచ్చారు. మధ్య, ఎగువ బెర్త్‌లకు చేరుకునేందుకు అనుకూల డిజైన్‌తో నిచ్చెనలు రూపొందించారు. -
మళ్లీ ఎయిర్‌లైన్స్ చౌక ఆఫర్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు మరోసారి చౌక చార్జీల ఆఫర్లు ప్రకటించాయి. ఈసారి పోరులో తాజాగా ఎయిరిండియా, గోఎయిర్ కూడా బరిలోకి దిగాయి. ‘మాన్సూన్ బొనాంజా’ పేరిట ఎయిరిండియా గురువారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం దేశీయంగా 40 రూట్లలో రూ. 1,499కే (పన్నులు అదనం) టికెట్లను అందిస్తున్నట్లు తెలిపింది. శనివారం దాకా బుకింగ్‌కి అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లపై సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వివరించాయి. మరోవైపు, చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో కూడా పలు రూట్లలో డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద వన్ వే టికెట్‌కి రూ. 1,389 నుంచి చార్జీలు ప్రారంభమవుతాయని ట్రావెల్ ఏజెంట్లకు పంపిన లేఖలో ఇండిగో పేర్కొంది. ఇందుకోసం 90 రోజులు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇవి తమ నెట్‌వర్క్‌లోని డెరైక్ట్ ఫ్లయిట్స్‌కు మాత్రమే వర్తిస్తాయని వివరించింది. అయితే, ఎప్పట్నుంచి బుక్ చేసుకోవచ్చన్న విషయాన్ని వెల్లడించని ఇండిగో.. ఈ ఆఫర్ కింద కొన్ని సీట్లను మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ 30లోగా ప్రయాణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది. మరోవైపు, ఇండిగో నెట్‌వర్క్‌లో ఢిల్లీ-లక్నో మధ్య వన్ వే ప్రయాణానికి అత్యంత చౌక చార్జీ రూ. 1,389గా ఉందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. అదే ఢిల్లీ-ముంబై టికెట్ చార్జీ రూ. 2,400 పైచిలుకు ఉంటుందన్నారు. ప్యాసింజర్ సర్వీస్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు, పన్నులన్నింటితో ప్రయాణికులు మరింత ఎక్కువే కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అటు, గోఎయిర్ సైతం 48 గంటల సేల్ ప్రకటించింది. 90 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై 30-40% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. జూలై- సెప్టెంబర్ మధ్య ప్రయాణాలకు ఈ చార్జీలు వర్తిస్తాయి. విమానయాన సంస్థలు ఇలా చార్జీల పోరుకు దిగడం ఈ ఏడాది ఇది నాలుగోసారి. మంగళవారం స్పైస్‌జెట్ రూపాయి ఆఫర్‌ని ప్రకటించడంతో సంస్థ వెబ్సైట్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. పోటీ సంస్థలను దెబ్బతీయడంతో పాటు ప్రయాణికులను మభ్యపెట్టే విధంగా ఉన్న ఈ ఆఫర్‌ని తక్షణమే ఆపేయాలంటూ విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. దీనిపై స్పైస్‌జెట్ బుధవారం వివరణనిచ్చింది. డీజీసీఏ ఆదేశాల మేరకు ఆ ఆఫర్‌ని తొలగించామని పేర్కొంది. ఢిల్లీ-ముంబై వంటి రూట్లలో ఇప్పటికీ ఇంధన సర్‌చార్జీలన్నీ కలుపుకుని అత్యంత చౌకగా రూ. 1,499కి టికెట్ అందిస్తున్నామని, పన్నులు కూడా కలిపితే మొత్తం చార్జీ రూ. 2,436 అవుతుందని స్పైస్‌జెట్ తెలిపింది. ప్రయాణికులు తక్కువ చార్జీల ప్రయోజనం పొందేందుకు టికెట్లను ముందుగా బుక్ చేసుకునేందుకు ఇటువంటి ఆఫర్లు ఉపయోగపడగలవని యాత్రాడాట్‌కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ అభిప్రాయపడ్డారు.


