Fact Check: ఇరాన్‌పై దాడికి భారత్‌లో యుఎస్ మిలటరీ బేస్? | India-US planning to attack Iran? | Sakshi
Sakshi News home page

Fact Check: ఇరాన్‌పై దాడికి భారత్‌లో యుఎస్ మిలటరీ బేస్?

Mar 21 2026 2:50 PM | Updated on Mar 21 2026 3:18 PM

India-US planning to attack Iran?

ఇరాన్‌పై దాడులకు అమెరికా భారత భూభాగాన్ని వాడుకుంటుందన్న వ్యాఖ్యలపై  భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదని అవి పూర్తిగా అవాస్తవాలని తెలిపింది. 

ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులతో తీవ్రకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు జరుపుతుంది. ఇదిలా ఉండగా టెహ్రాన్‌పై దాడులకు భారత భూభాగాన్ని యుఎస్‌ఏ వాడుకోనుందని LEMOA ఒప్పందాన్ని అనుసరించి కొంకణ్ తీరంలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేయనుందని కథనాలు ప్రచురితమయ్యాయి.

దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ప్రకటనలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని  భారత విదేశాంగ శాఖ అధికారిక ఖాతాలో పేర్కొంది

LEMOA నేపథ్యం
లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA) అనేది 2016లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన ఒక ద్వైపాక్షిక లాజిస్టిక్స్ ఒప్పందం. ఇది ఇరు దేశాల సాయుధ దళాలు ఒకరి సైనిక సౌకర్యాలను మరొకరు ఇంధనం నింపుకోవడానికి, మరమ్మతులకు, సరఫరాలకు విశ్రాంతికి తదితర సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తుంది. 

అయితే ఈ ఒప్పందం ఒకరి భూభాగంపై మరొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు దానికి ప్రత్యేక  ఆమోదం అవసరం. కానీ ఈ ఒప్పందం కింద అమెరికా మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగగా భారత్ దానిని ఖండించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement