అరుణాచల్‌ ప్రదేశ్‌లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’

India Raects To Pentagon Said Village in Arunachal Pradesh Located In China - Sakshi

ఆ గ్రామం చైనాలోనే ఉంది

న్యూఢిల్లీ: చైనా ఒక గ్రామాన్ని ఏకంగా భారత భూభాగంలోనే నిర్మించి, అభివృద్ధి చేసిందంటూ అమెరికా ఇటీవల తన అంతర్గత నివేదికలో పేర్కొనడంపై భారత భద్రతా వర్గాలు ఒక స్పష్టతనిచ్చాయి. భారత్‌–చైనా సరిహద్దుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. 

ఈ గ్రామం ఉన్న భూభాగం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా అధీనంలోనే ఉందని భారత భద్రతా దళాల్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘ఆ ప్రాంతంలోని భారత అస్సాం రైఫిల్స్‌ పోస్ట్‌ను 1959లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆక్రమించుకుంది. దీనిని లాంగ్జూ ఘటనగా పేర్కొంటారు. అప్పటి నుంచీ ఆ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉంది’ అని భారత సైనిక వర్గాలు తెలిపాయి.    
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top