సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం! | India first mission to study the Sun is getting ready for launch | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం!

Aug 15 2023 6:41 AM | Updated on Aug 15 2023 7:15 AM

India first mission to study the Sun is getting ready for launch - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్‌–3 మిషన్‌ను ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆదిత్య–ఎల్‌1 పేరిట అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. సెపె్టంబర్‌ మొదటివారంలో ప్రయోగం ఉటుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఆదిత్య–ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌ బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ నుంచి శ్రీహరి కోటలో ఉన్న ‘షార్‌’కు చేరుకుంది.

  షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగిస్తారు. ఇక్కడి వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో మూడు దశల రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఆదిత్య–ఎల్‌1కు క్లీన్‌రూంలో పరీక్షల అనంతరం రాకెట్‌ శిఖరభాగంలో అమర్చుతారు. ప్రయోగం ద్వారా సూర్యుడు–భూమి వ్యవస్థలోని లాంగ్‌రేంజ్‌ పాయింట్‌ 1(ఎల్‌1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనానికి అడ్డంకులుండవని సైంటిస్టులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement