Covid - 19, India New Corona Cases Recorded 1,32,364 - Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు

Jun 4 2021 10:52 AM | Updated on Jun 4 2021 4:01 PM

 India Corona Bulletin Reports New Covid Cases Deaths - Sakshi

సాక్షి ,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌లో తెలిపింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2713.

ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా కేసులు 16,35,993 ఉన్నాయి. 24 గంటల్లో20,75,428 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,74,33,846. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో 140 రోజులుగా కొనసాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 28,75,286 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది.  దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్‌ పొందిన వారు 22,41,09,448 మంది ఉన్నారు.

చదవండి: కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement