ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం

India Completes 1 Year Of Vaccine Drive: Union Minister  - Sakshi

కరోన మహమ్మారితో విలవిలలాడిపోయిన భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తైయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ "ప్రపంచంలో అత్యంత విజయవంతమైనది"గా పేర్కొన్నారు. గతేడాది ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన అభినందించారు.

ఈ మేరకు మాండవ్వ మాట్లాడుతూ.." ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించి నేటికి ఒక ఏడాది పూర్తైయింది. 'సబ్కే ప్రయాస్'తో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ప్రక్రియ నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియగా అభివర్ణించారు. అంతేకాదు ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కి సహాయ సహకారాలు అందించిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పైగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏవిధంగా ప్రారంభమైందో ఎలా విజయవింతమైందో వంటి విషయాలకు సంబంధించిన గ్రాఫికల్‌ చార్ట్‌లను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ జనవరి 16, 2021న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌లో కోవిడ్‌-19 వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపు 156.76 కోట్లకు పైగా డోసులను అందించింది. గత 24 గంటల్లో సుమారు 66 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందిచారు. అంతేగాక భారత్‌లో గడిచిన  24 గంటల్లో 2,71,202 కొత్త కోవిడ్ -19 కేసులు, 314 మరణాలు సంభవించగా, 1,38,331 రికవరీలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

(చదవండి: ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top