భార‌త సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్

India To Buy 70000 Latest AK Rifles From Russia - Sakshi

ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను తయారు చేసి భారత ఆర్మీకి అందుబాటులోకి తీసుకు వస్తుంది. తాజాగా 70 వేల ఏకే 200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ సైన్యానికి అందించదనం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 7 లక్షల ఏకే-203 రైఫిల్స్ ను సంయుక్తంగా తయారు చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఆ ఒప్పందం 2018 నుంచి ఇప్పటికీ పెండింగ్ లో ఉంది.(చదవండి: వాయుసేనకు అందుబాటులో అధునాతన చాఫ్‌ టెక్నాలజీ)

రక్షణ & భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 7.62×39 మి.మీ ఏకే-203 రైఫిల్ లో 20,000ను నేరుగా దిగుమతి చేసుకుని, మిగిలిన వాటిలో 6.5 లక్షలను మన దేశంలో సంయుక్తంగా తయారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఒకవేల ఉమ్మడి ఉత్పత్తి సమయంలో ఆలస్యం అయితే వాటిలో ఎక్కువ వాటిని షెల్ఫ్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫ్-ది-షెల్ఫ్ ఎక్విప్ మెంట్ లో ఏకే 200 సిరీస్ లో చాలా వేరియెంట్స్ ఉండవచ్చు. రైఫిల్ తయారీ సంస్థ అయిన ఇండో-రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

ఈ రైఫిళ్లను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అంధించనున్నారు. ప్రస్తుతం సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో వినియోగిస్తున్న 5.56×45 మి.మీ ఐ.ఎస్.ఎ.ఎస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్స్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. భారత సాయుధ దళాలు 7.62×51 మి.మీ అమెరికన్ సీజీ 716 రైఫిళ్లను కూడా ఉపయోగిస్తున్నాయి. వీటిని ఫ్రంట్ లైన్ పదాతి దళ సైనికులు వినియోగిస్తారు. మిగిలిన వారు ఏకే-203ను ఉపయోగిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top