ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీ దాడులు

Income Tax Department Raids On Aditya Thackerays Associates - Sakshi

ముంబై: మహారాష్ట్ర మంత్రి, శివసేన అధినేత ఉద్దవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఆదాయపన్ను శాఖ పలు దాడులు నిర్వహించింది. బెంగాల్, ఏపీలోలాగా తమను వ్యతిరేకించేవారిని కేంద్రం లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిస్తోందని ఆదిత్య విమర్శించారు. పార్టీ ఆఫీస్‌ బేరర్, షిర్డీ ట్రస్ట్‌ సభ్యుడు రాహుల్‌ కనాల్, కేబుల్‌ ఆపరేటర్‌ సదానంద్‌ కదమ్, బజరంగ్‌ ఖర్మాటే నివాసాలపై ఐటీ శాఖ మంగళవారం దాడులు నిర్వహించింది.

వీరిలో రాహుల్‌ ఆదిత్యకు, మిగిలిన ఇద్దరు శివసేన మంత్రి అనీల్‌పరాబ్‌కు సన్నిహితులు. ముంబై కార్పొరేషన్‌ ఎన్నికలయ్యేవరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని సేన నేత సంజయ్‌రౌత్‌ కేంద్రంపై విమర్శలు సంధించారు. రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14మంది ప్రముఖులపై దాడులు జరిగాయని, వీరిలో ఎవరూ బీజేపీకి చెందరని చెప్పారు. తాము బీజేపీకి చెందిన పలువురి పేర్లను ఐటీ, ఈడీలకు పంపామని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.  

(చదవండి: ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top