‘కరోనా’ని ఒక ఆట ఆడేయండి

IIT Madras Students Develop Free Game To Raise Coronavirus Awareness - Sakshi

మీ పిల్లలు కరోనా జాగ్రతలు పాటించడం లేదా? అయితే వారితో ఈ గేమ్‌ ఆగించండి. మీకే ఎలా భద్రంగా ఉండాలో చెప్తారు. ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు పిల్లల్లొ అవగాహన పెంచడానికి ఐఐఎమ్‌ కోవిడ్‌ గేమ్‌ని రూపొందించారు. ఇది 12 ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంది. కోవిడ్‌-19 పై పిల్లల్లో అవేర్‌నెస్‌ కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక బ్రౌజర్‌ బేస్డ్‌ గేమ్‌ దీన్ని మోబైల్‌, టాబ్లెట్‌, లాప్‌టాప్‌, పీసీ ఎందులోనైనా ఆడొచ్చు. కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడటానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గేమ్‌ని రూపొందించారు. ప్రసిద్ధ సూపర్‌ మరియో గేమ్‌ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించారు.  ఒక నిమిషం పాటు సాగే కోవిడ్‌-19  ఆటలో గరిష్ట పాయింట్లు సాధించడానికి సరైన పనులు చేయాలి.

ఎక్కువ పాయింట్లు సాధించినవారు విన్నర్‌. సరైన పనులు అంటే గేమ్‌లో పాత్రలు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలి(మాస్క్‌ ధరించటం, శానిటైజర్‌ వాడటం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం ) ఇవి సరిగా పాటించినప్పుడల్లా ఒక పాయింట్‌ కలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోతారు.ఐఐఎమ్‌ కోవిడ్‌ గేమ్‌ని వసుధ టీకే, ఎన్‌ఎస్‌ కీర్తి, శివప్రియ వెళైచామీ అనే విద్యార్థులు రూపొందించారు. ఈ గేమ్‌ని విద్యార్థులు జనవరి నుంచి మే మధ్య అందించే లెట్స్‌ ప్లే టూ లెర్న కోర్స్‌లో భాగంగా రూపొందించారు. ఈ కోర్సులో 30 మంది విద్యార్థులు పాలుపంచుకుని వివిధ అంశాలపై బోర్డ్‌ గేమ్స్‌ రూపొందించారు. ఇందులో ముగ్గురు  కరోనా సంబంధిత గేమ్‌ని తయారుచేశారు. కొందరి అభిప్రాయం సేకరించిన తర్వాత గేమ్‌ని ఇంకొన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని గేమ్స్‌ని రూపొందిస్తామని విద్యార్థులు అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top