ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ చెల్లదు : హర్యానా హై కోర్టు

High Court declares haryana private employment reservation act void - Sakshi

న్యూఢిల్లీ : స్థానికులకు తక్కువ వేతనాలున్న ప్రయివేటు ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్నిపంజాబ్‌, హర్యానా హై కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. మరో ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ టైమ్‌లో హర్యానా స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ యాక్ట్‌ను హై కోర్టు కొట్టివేయడం అధికార బీజేపీకి పెద్ద దెబ్బ అనే ప్రచారం జరగుతోంది. 

రాష్ట్రంలోకి భారీగా వలస వచ్చిన వారిని స్థానికంగా ప్రయివేటు ఉద్యోగాల్లోకి రాకుండా నిలువరించేందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.ముఖ్యంగా 30 వేల రూపాయలలోపు వేతనాలున్న ఉద్యోగాల్లోకి వలసవచ్చినవారు చేరడం వల్ల స్థానికుల్లో పేదరికం పెరిగిపోతుందని పేర్కొంది. ఈ చట్టాన్ని 2020లో అసెంబ్లీలో పాస్‌ చేశారు.రాషష్ట్రంలో కీలకంగా ఉన్న జాట్‌ల ఓట్లపై కన్నేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది.  

నిజానికి ఈ చట్టం దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. బీజేపీ ప్రభుత్వంతో జననాయక్‌ జనతా పార్టీ చేరడమే కాకుండా పార్టీ నేత దుష్యంత్‌ చౌతాలా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్నారు.   

ఇదీచదవండి..ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top