breaking news
Hayana
-
ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు
న్యూఢిల్లీ : స్థానికులకు తక్కువ వేతనాలున్న ప్రయివేటు ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్నిపంజాబ్, హర్యానా హై కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. మరో ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ టైమ్‌లో హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్‌ను హై కోర్టు కొట్టివేయడం అధికార బీజేపీకి పెద్ద దెబ్బ అనే ప్రచారం జరగుతోంది. రాష్ట్రంలోకి భారీగా వలస వచ్చిన వారిని స్థానికంగా ప్రయివేటు ఉద్యోగాల్లోకి రాకుండా నిలువరించేందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.ముఖ్యంగా 30 వేల రూపాయలలోపు వేతనాలున్న ఉద్యోగాల్లోకి వలసవచ్చినవారు చేరడం వల్ల స్థానికుల్లో పేదరికం పెరిగిపోతుందని పేర్కొంది. ఈ చట్టాన్ని 2020లో అసెంబ్లీలో పాస్ చేశారు.రాషష్ట్రంలో కీలకంగా ఉన్న జాట్ల ఓట్లపై కన్నేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ చట్టం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. బీజేపీ ప్రభుత్వంతో జననాయక్ జనతా పార్టీ చేరడమే కాకుండా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్నారు. ఇదీచదవండి..ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్ -
'దంగల్' ఎఫెక్ట్: స్పందించిన సీఎం!
ఛండీగఢ్: బాలీవుడ్ 'మిస్టర్ ఫర్ఫెక్ట్' ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో పాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చింది. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ ఆయన కూతుళ్లకు రెజ్లింగ్ శిక్షణ ఇచ్చి ఎలా సక్సెస్ సాధించారన్న కథాంశం ఆధారంగా దంగల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ కారణంగా హర్యాణా ప్రభుత్వం రెజ్లింగ్ క్రీడాకారులకు సహాకారం అందిస్తోంది. అకాడమీలకు వంద రెజ్లింగ్ మ్యాట్లను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న మ్యాట్లను అకాడమీలకు అందజేస్తే.. రెజ్లర్ల ప్రాక్టీస్ ఇబ్బందులు కాస్తయినా తగ్గే అవకాశం ఉంది. గీతా ఫోగట్, బబితా ఫోగట్‌లతో పాటు, వారి తండ్రి, కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్‌ను సీఎం మరోహర్ లాల్ ఖట్టర్ కలుసుకుని వారిని అభినందించారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించడానికి, రాష్ట్రంలో క్రీడలను మెరుగు పరిచేందుకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు. కమిటీ సిఫారసుల మేరకు కొత్త పాలసీని తీసుకొస్తామన్నారు. రాష్ట్ర అత్యుత్తమ ప్లేయర్స్‌కు తగిన ఉద్యోగం, ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం ధీమా ఇచ్చారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన 'దంగల్' మూవీలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఓవరాల్‌గా రూ.411 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది.