కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు దుర్మరణం | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు దుర్మరణం

Published Tue, Oct 18 2022 12:31 PM

Helicopter Crashes In Uttarakhand Kedarnath - Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట‍్లు, ఐదుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

ఐదుగురు యాత్రికులతో గుప్తకాశీలోని ఫటా హెలిప్యాడ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు బయలుదేరిన హెలికాప్టర్‌ కొద్దిసేపటికే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకోవటంతో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సిందియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్యాన్‌ విమానయాన సంస్థ బెల్‌ 407 హెలికాప్టర్‌ వీటీ-ఆర్‌పీఎన్‌ ప్రమాదానికి గురైనట్లు డైరెక‍్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ తెలిపింది.

ఇదీ చదవండి:  కశ్మీర్‌లో మళ్లీ పౌరులపై దాడులు.. నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య

 
Advertisement
 
Advertisement