ATA Celebrations 2022: ఘనంగా ఆటా వేడుకలు

Grand Ata celebrations AT Washington DC - Sakshi

రికార్డు స్థాయిలో 15 వేల మంది ప్రతినిధులు హాజరు

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు ముగిశాయి. సమావేశాలకు తెలుగు వాళ్లు పోటెత్తారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, క్రికెట్‌ దిగ్గజాలు కపిల్‌ దేవ్, సునీల్‌ గవాస్కర్, క్రిస్‌ గేల్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏకంగా 15,000 మందికిపైగా హాజరవడం విశేషం. వేడుకల సందర్భంగా కపిల్, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్, సద్గురు గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో కూడా పాల్గొన్నారు. బతుకమ్మపై ఆటా ముద్రించిన పుస్తకాన్ని టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శివమణి, థమన్‌ మ్యూజికల్‌ నైట్‌ శ్రోతలను ఉర్రూతలూగించింది.

తెలంగాణ నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, ఏపీ నుంచి ప్రజాప్రతినిధులు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌధరి తదితరులు పాల్గొన్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అందరినీ మైమరిపించింది. మనో, కార్తీక్‌ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటా ప్రెసిడెంట్‌ భువనేశ్‌ బుజాల, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కో ఆర్డినేటర్‌ కిరణ్‌ పాశం, ఆటా ఫౌండింగ్‌ మెంబర్‌ హనుమంత్‌ రెడ్డి, తదితరులు మాట్లాడారు. హీరో అడివి శేష్, సినీ నటుడు తనికెళ్ల భరణి తదితరులు సందడి చేశారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top