‘మహమ్మారి’ పగ: అయ్యో.. ఆమె చనిపోయింది

Girl From Love You Zindagi Viral Video Died Due To Covid - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా కొనసాగుతోంది. చిన్నపెద్దా తేడాలేకుండా చాలా మంది కరోనా కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దాల్సిన యువత ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. ‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి’ వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వజ్ర సంకల్పం విధి ఆడే ఆటలో నేలకొరిగింది.

ఢిల్లీకి చెందిన ఓ 30 సంవత్సరాల యువతి కరోనా కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది. కోవిడ్‌ చికిత్స సమయంలో 2016లో వచ్చిన షారుఖ్‌ ఖాన్, అలియా భట్‌.. ‘‘డియర్‌ జిందగీ’’ సినిమాలోని పాటలు వింటున్న యువతి వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. మహమ్మారిబారిన పడినా కూడా ఎంతో ధైర్యంగా, దాని నుంచి బయటపడతాననే నమ్మకం ఆమె ముఖంలో కనిపించడం పలువురిలో స్ఫూర్తిని నింపింది. అయితే సదరు యువతి కరోనాతో పోరాడుతూ మరణించినట్లు డాక్టర్‌ మోనికా లాంగే ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘దురదృష్టవశాత్తు ఓ ధైర్యవంతురాలిని కోల్పోయాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ డాక్టర్‌ లాంగే గురువారం ట్వీట్‌ చేశారు. 

ఆ యువతి మరణ వార్తను ట్వీట్‌ చేయడానికి ముందు లాంగే మే10న ఆమె చికిత్సకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ‘‘ఆమెకు ఐసియు బెడ్‌ దొరికింది. దయచేసి ఆ యువతి కోసం ప్రార్థించండి. మన ఆలోచనలు, మన ప్లానింగ్స్‌తో కొన్నిసార్లు ఏం చేయలేం. అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది.’’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా దీనిపై సోనూ సూద్‌ స్పందిస్తూ.. ‘‘ఇది బాధాకరమైన ఘటన. ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూడదని  ఊహించలేదు. చాలా మంది జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఇది చాలా అన్యాయం’’ అంటూ రాసుకొచ్చారు. నెటిజన్లు సైతం యువతి మరణం పట్ల సానుభూతి తెలియజేస్తున్నారు.

(చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-05-2021
May 15, 2021, 05:25 IST
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): కోవిడ్‌ వ్యాక్సిన్‌లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జీ కొండూరు మండలం...
15-05-2021
May 15, 2021, 05:24 IST
ముంబై: కరోనా వైరస్‌ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్‌...
15-05-2021
May 15, 2021, 05:04 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు ఇకపై మాస్కు ధరించాల్సిన...
15-05-2021
May 15, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ...
15-05-2021
May 15, 2021, 04:50 IST
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్‌ వేవ్‌ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు,...
15-05-2021
May 15, 2021, 04:33 IST
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్,...
15-05-2021
May 15, 2021, 04:23 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నికర...
15-05-2021
May 15, 2021, 04:18 IST
తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య...
15-05-2021
May 15, 2021, 04:13 IST
ఒంగోలు టౌన్‌: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు....
15-05-2021
May 15, 2021, 03:36 IST
సాక్షి, అమరావతి: కరోనా బాధితుల్లో ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ గుబులు రేపుతోంది. నాసో ఆర్బిటల్‌ మెనింగ్‌ మ్యుకర్‌ మైకోసిస్‌ లేదా...
15-05-2021
May 15, 2021, 03:00 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్‌కు తగినంతగా ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ...
14-05-2021
May 14, 2021, 21:26 IST
సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ...
14-05-2021
May 14, 2021, 21:25 IST
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో...
14-05-2021
May 14, 2021, 20:40 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య...
14-05-2021
May 14, 2021, 18:52 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల...
14-05-2021
May 14, 2021, 17:51 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,88,803...
14-05-2021
May 14, 2021, 16:13 IST
పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. మానసిక రుగ్మతలైన....
14-05-2021
May 14, 2021, 15:55 IST
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన...
14-05-2021
May 14, 2021, 14:45 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్‌ చిదిమేసింది. కోవిడ్‌ కారణంగా...
14-05-2021
May 14, 2021, 14:40 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రెండో దశలో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో  ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top