హత్రస్‌లో మరో ఘోరం!

Four Year Girl Assaulted by Family Member in Hathras - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బాలికపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఘోరమైన ఘటన హత్రాస్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఆమె తరుపు బంధువులే అత్యాచారం చేశారు. బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా అరవింద్‌ అనే వ్యక్తి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని బాలిక మామయ్య తెలిపారు.

అనంతరం సాయంత్రం పూట బాలికను చూసిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆమెను వైద్యులకు చూపించారు. వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారించారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సెప్టెంబర్‌లో హత్రాస్‌లో బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడి ఘోరంగా హింసించారు. అనంతరం ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.   చదవండి: హథ్రాస్‌ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top