బాధితురాలిపై కుటుంబ సభ్యులే దాడి చేశారు

Village Head Says Victims Family Objected To Her Relationship With Accused - Sakshi

గ్రామ పెద్ద ఆరోపణలు

లక్నో : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హథ్రాస్‌ హత్యాచార ఘటనపై గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని, వారి సన్నిహిత సంబంధం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. నిందితుడే బాలికకు సెల్‌ ఫోన్‌ ఇచ్చాడని, కుటుంబ సభ్యులే బాధితురాలిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. హిందూ మతంలో అలాంటి హేయమైన నేరానికి (సామూహిక లైంగికదాడి) ఎవరూ పాల్పడరని, నిందితులంతా నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇతరుల నేరానికి మరో వ్యక్తి ని శిక్షించరాదని అన్నారు. నిందితులపై నేరాన్ని ముందుగా రుజువు చేయాలని కోరారు.

బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం సహించలేదని ఆయన ఆరోపించారు. బాలికను కలిసేందుకు నిందితుడు రాగా పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారని ఆరోపించారు. ఇక బాధితురాలు కుటుంబం, నిందితుడి మధ్య పలుమార్లు ఫోన్‌ సంభాషణలు జరిగాయని, ఈ కేసులో బాలిక సోదరుడిని పోలీసులు ప్రశ్నించాలని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ డిమాండ్‌ చేశారు. ఇక ఈ కేసు నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామనే పేరుతో గ్రామంలో ఉన్నారని, ఇది గ్రామంలో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తుందని గ్రామ పెద్ద హథ్రాస్‌ ఎస్డీఎంకు లేఖ రాసినట్టు సమాచారం. చదవండి : మరో పరువు హత్య కలకలం!

సెప్టెంబర్‌ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. దుండగులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రంగా హింసించిన‍్నట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్‌ 29న కన్ను మూసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top