భర్తను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య!

Fight Between Couple After Wife Catches Man With Another Woman In Meerut - Sakshi

లక్నో: తన భర్త తనను కాదని వేరే మహిళతో షాపింగ్‌కి వచ్చాడు. ఇది చూసిన ఆ వ్యక్తి భార్య ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే అతడిని తిడుతూ, పిడిగుద్దులతో దాడిచేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకొంది. అయితే వీరి గొడవ పెద్దదిగా మారడంతో షాప్‌యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ,పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వీరిద్దరికి ఇది వరకు వివాహంజరిగిందని తెలిపారు. దీనిలో బాధితురాలు అయేషా, తన భర్త అద్నాన్కు‌ 2020లోనే వివాహం జరిగిందని చెప్పింది. వివాహం అయిన కొద్దిరోజులకే తనను పుట్టింట్లో వదిలేశాడని వాపోయింది. 

కాగా, విడాకులు ఇమ్మని బలవంతం చేశాడని చెప్పింది. అయితే, నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపింది. మాకు విడాకులు మంజురు కాలేదు.. కాబట్టి తన భర్త వేరే మహిళతో తిరగటాన్ని తప్పుబట్టింది.  అయితే దీనిపై ఆమె భర్త.. అయేషా అంటే నాకు ఇష్టంలేదు. ఇప్పటికే విడాకులు ఇచ్చాను. నేను వేరే మహిళతో షాపింగ్‌చేస్తే అనవసరంగా రాధ్దాతం చేస్తొందని అన్నాడు. కాగా, దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: అ‍త్యంత కలుషిత నగరాల్లో  22 భారత్‌లోనే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top