చిన్నారుల్లో బ్లాక్‌ ఫంగస్‌.. కళ్లు తొలగించిన వైద్యులు

Eyes of 3 Children Infected With Black Fungus Removed in Mumbai - Sakshi

ముంబైలో చోటు చేసుకున్న సంఘటన

ముంబై: కరోనా కన్నా అధికంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంతవరకు పెద్దల్లో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి తాజాగా చిన్నారుల్లోను వెలుగు చూసింది. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి ముగ్గురు చిన్నారుల కళ్లు తొలగించాల్సి వచ్చింది. వీరిలో4,6,14 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఫంగస్‌ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసి ఒక కన్ను తొలగించారు. 

ఆ వివరాలు.. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక డయాబెటిస్‌ సమస్య ఉంది. ఈ క్రమంలో ఆమెకు కంట్లో ఏదో ఇబ్బందిగా అనిపించి ఆస్పత్రికి వెళ్లింది. అనూహ్యంగా హాస్సిటల్‌కు వెళ్లిన 48 గంటల్లోనే బాలిక కన్ను పూర్తిగా నల్లగా మారింది. ఫంగస్‌ ముక్కు వరకు సోకింది. బాలిక అదృష్టం కొద్ది మెదడుకు చేరలేదు. బాలిక పరిస్థితి విషమిస్తుండటంతో వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. దాదాపు ఆరు వారాల పాటు వైద్యం చేసినప్పటికి.. ఫలితం లేకపోయింది. చివరకు బాలిక కంటిని తొలగించాల్సి వచ్చింది. 

ఇక పైన చెప్పుకున్న మరో చిన్నారులిద్దరికు డయాబెటిక్‌ సమస్య లేదు. కానీ కోవిడ్‌ బారినపడ్డారు. ఆ తర్వాత వీరిలో బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. చిన్నారులిద్దరిని ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్‌ ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత చిన్నారులిద్దరికి ఆపరేషన్‌ చేసి కన్ను తొలగించారు. సర్జరీ చేసి కన్ను తొలగించకపోతే బాధితుల జీవితం ప్రమాదంలో పడేదన్నారు వైద్యులు. ఇక 16 ఏళ్ల బాధితురాలు నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. కోవిడ్‌ బారిన పడి కోలుకుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె డయాబెటిస్‌ బారిన పడింది. ఆమె పేగుల్లో రక్తస్రావం కాసాగింది. యాంజియోగ్రఫీ చేసి ఆమె కడుపు దగ్గర రక్తనాళాలకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు గుర్తించామని తెలిపారు వైద్యులు. 

‘‘4,6 ఏళ్ల చిన్నారులిద్దరిలో అప్పటికే ఫంగస్‌ కంటిలోకి చేరి.. వారిని తీవ్రంగా బాధించింది. ఇక వీరిలో ఒకరు గతేడాది డిసెంబర్‌లో మా వద్దకు రాగా.. రెండవ కేసు సెకండ్‌వేవ్‌ సమయంలో వచ్చింది’’ అని ఆసుపత్రిలో ఓక్యులోప్లాస్టీ, ఓక్యులర్ ఆంకాలజీ అండ్‌ ఓక్యులర్ ప్రొస్థెటిక్ డాక్టర్ ప్రితేష్ శెట్టి తెలిపారు.

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ పనిపట్టే ఔషధాలు ఇవే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top