Evening Top 10 News Today: ఈవెనింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

Evening Top 10 Telugu News Latest Updates Telugu Online News 20th July 2022 - Sakshi

1. రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో మేలు.. సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్‌
రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బుధవారం పోర్టు పూజా కార్యక్రమం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసులో ఇద్దరు నిందితులు హతం
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో  భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు  హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. టీడీపీలోనూ ఓ షిండే.. చంద్రబాబుకి గెలిచే శక్తి లేదు: టీడీపీ కీలక నేత వ్యాఖ్యల కలకలం
తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేలా.. టీడీపీకి సీఎం రమేష్ ఉన్నాడంటూ ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారాయన.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పోర్టు మా కల.. జగనన్నకు కృతజ్ఞతలు: నిర్వాసితులు
ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ.. ‘అంతా తెలంగాణ సర్కారే చేసింది’
తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే
శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం
 శివసేన చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్‌నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం.. సంతోషంగా ఉందంటూ ప్రధాని ట్వీట్‌
ఇటీవ‌లే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఇవాళ (జూలై 20) ఉదయం పార్లమెంట్‌ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ
మెగాస్టార్‌ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు సీపీఐ నారాయణ. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.ప్రయాణికులకు షాకిచ్చిన భారతీయ రైల్వే!
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్‌ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top