మార్చి నెలలో కొత్తగా 12.24 లక్షల ఉద్యోగాలు

ESIC scheme adds 12 lakh above new members in March 2021 - Sakshi

న్యూఢిల్లీ: గత మార్చి నెలలో సుమారు 12.24 లక్షల మంది కొత్త సభ్యులు ఈఎస్‌ఐసీ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలో చేరారు. గత ఏడాది మార్చి నెలలో ఈ సంఖ్య 11.77 లక్షలుగా ఉంది. అంటే ఆ నెలలో దేశవ్యాప్తంగా అన్ని కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలుస్తుంది. తాజా గణాంకాలు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొంది. తాజా డేటా ప్రకారం.. 2020-21లో ఈఎస్‌ఐసీ స్థూల నమోదు 24 శాతం తగ్గి 1.15 కోట్లకు చేరుకుంది కొవిడ్‌ మహమ్మారి దీనికి కారణమని, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో 1.51 కోట్ల మంది కొత్తగా ఈ పథకంలో చేరారని ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది.

2018-19లో ఈఎస్‌ఐసీ కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని ఎన్‌ఎస్‌ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు సుమారు 83.35 లక్షల మంది కొత్త చందాదారులు ఈఎస్‌ఐసీ పథకంలో చేరారు. సెప్టెంబర్ 2017 నుంచి 2021 మార్చి వరకు ఈఎస్‌ఐసీలో స్థూలంగా కొత్త నమోదుల సంఖ్య దాదాపు ఐదు కోట్లు. కొత్త చందాదారుల పేరోల్ డేటా అనేది ఈఎస్‌ఐసీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్ డీఏ) ఆధారంగా రూపొందించబడింది.

చదవండి:

కోవిడ్‌-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కార్పొరేట్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top