Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి! | Elephant Comes Across Tiger While Walking In The Forest | Sakshi
Sakshi News home page

Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!

Jun 2 2021 9:32 AM | Updated on Jun 2 2021 12:55 PM

Elephant Comes Across Tiger While Walking In The Forest - Sakshi

జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే.  అయితే తాజాగా ఓ ఏనుగును చూసిన ఓ పులి తుర్రున పారిపోయింది. దారికి అడ్డంగా పడుకుని సేదతీరుతున్న ఓ పులి.. అదే దారిలో వస్తున్న ఏనుగును చూసి పిల్లిలా తప్పుకుంది. 21 సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో ఏనుగు తన మార్గంలో తాను నడుచుకుంటూ వస్తుంది. ఇక రెండూ భీకరంగా తలపడుతాయేమోనని.. అని చాలామంది అనుకుంటారు. కానీ వెనుక నుంచి వస్తున్న ఏనుగును చూసిన పులి.. లేచి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. దీంతో ఏనుగు దర్జాగా తన దారి గుండా వెళ్లింది. 

ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా.. "చివరి వరకు ఆగి.. ఏం జరిగిందో మీరూ చూడండి" అనే ట్యాగ్‌తో ట్విటర్‌లో  పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఎవరు తీశారో అతడి కోసం వెతకండి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పటివరకు దీన్ని లక్ష మందికి పైగా నెటిజన్లు వీక్షించగా.. 5300 మంది లైక్‌ కొట్టారు.

దీనిపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ స్పందిస్తూ.."ఏనుగు అడవికి ప్రభువు" అని నేను ఎప్పుడూ చెబుతున్నాను.. అతనికి వ్యతిరేకంగా ఎవరూ నిలువరు "అని కామెంట్‌ చేశారు. ఇక పులులు చాలా వరకు ఏనుగు వంటి పెద్ద జంతువులను వేటాడవు. సాధారణంగా జింకలు, కోతులు, పందుల వంటి వాటిని వేటాడుతాయి.
 


(చదవండి: విషాదం: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఏడుగురి మృతి)

Advertisement
 
Advertisement
Advertisement