CEC Removed State Party Recognition of BRS in Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉపసంహరణ

Apr 10 2023 8:39 PM | Updated on Apr 10 2023 8:55 PM

EC Revokes BRS Party AP State Status - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీ గుర్తింపు తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపును ఉప సంహరించింది.  ఇక పాండిచ్చేరిలో పీఎంకే, వెస్ట్‌ బెంగాల్‌లోలో ఆర్‌ఎస్‌పీల రాష్ట్ర గుర్తింపులను రద్దు చేసింది. అయితే యూపీలో ఆర్‌ఎల్‌డీకి మాత్రం రాష్ట్ర పార్టీ గుర్తింపు ఇచ్చింది ఈసీ.

కాగా, ఆప్‌ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. 

అయితే, 2012లో స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement