మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిని గుర్తించింది.. | Dogs In Army Act As Stress Buster Friends For Soldiers Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జవాన్ల శ్రేయోభిలాషి ‘రోష్‌’

Oct 5 2020 7:51 AM | Updated on Oct 5 2020 8:06 AM

Dogs In Army Act As Stress Buster Friends For Soldiers Jammu Kashmir - Sakshi

షోపియాన్‌: ఒత్తిడుల నుంచి కాపాడే గొప్ప నేస్తాలు శునకాలు. కశ్మీర్‌లోని సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న 44 రాష్ట్రీయ రైఫిల్స్‌(ఆర్‌ఆర్‌)కు సేవలందిస్తున్న ‘రోష్‌’విషయంలో ఇది అక్షరాలా సత్యం. రెండేళ్ల వయస్సున్న ఈ లాబ్రడార్‌ జాగిలం ఆ కంపెనీలోని సైనికులందరికీ ఆప్తమిత్రుడు.  ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, మందుపాతరల గుర్తింపు, చొరబాటుదార్ల ఏరివేత వంటి వాటి కోసం 44వ ఆర్‌ఆర్‌ యూనిట్‌ దక్షిణ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఇందులోనే రోష్, తపి, క్లైడ్‌ అనే శునకాలతో కెనైన్‌ స్క్వాడ్‌ ఉంది.   ‘మా సెలిబ్రిటీల్లో రోష్‌ కూడా ఒకటి. గత ఏడాది ద్రగార్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ సందర్భంగా సుజ్జు మగ్రే అనే మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది తప్పించుకుపోయాడు.  (చదవండి: ఎల్‌ఏసీ వద్ద పాకిస్తాన్‌ సైనికులు!)

సంఘటన ప్రాంతం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని చెట్ల పొదల్లో దాక్కుని ఉండగా అతడిని రోష్‌ గుర్తించింది’ అని 44 ఆర్‌ఆర్‌ చీఫ్‌ కల్నల్‌ ఏకే సింగ్‌ తెలిపారు. ‘నాతోపాటు మా యూనిట్‌ సభ్యులందరికీ రోష్‌ అంటే ఇష్టం. ఏదైనా మంచి పనిచేసినప్పుడు అందరూ రోష్‌ను ప్రేమగా తట్టడం, పలకరించడం, ఆడుకోవడం, బిస్కెట్లు వంటి తినిపించడం చేస్తుంటారు’అని రోష్‌ను నిమురుతూ ఆయన గర్వంగా చెప్పారు. ఈ ఏడాది ఆర్మీ డే సందర్భంగా ఈ ప్రాంత ఆర్మీ చీఫ్‌ నుంచి కమెండేషన్‌ కార్డు కూడా పొందిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement