ఏది నిజం, అక్కడ అమ్మాయిలు ఉన్నట్లా! లేనట్లా?

Discrepancy Between The Niti Aayog Sdg Data And Uttarakhand Government Data - Sakshi

ఉత్తరాఖండ్‌లో లింగనిష్పత్తిపై గందరగోళం

నీతిఆయోగ్‌ది ఓ లెక్క, రాష్ట్ర ప‍్రభుత్వంది మరోలెక్క 

ఉత్తరాఖండ్‌: దేశంలో కనీసం 1000మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు జన్మిస్తున్నారనే విషయంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సర్వే నిర్వహించి రిపోర్ట్‌ ను విడుదల చేస్తాయి. వాటి ఆధారంగా ఆయా రాష్ట్రాల​ లింగ నిష్పత‍్తుల్ని నిర్ధారిస్తారు. తాజాగా ఉత్తరాఖండ్‌ లింగ నిష్పత్తుల్లో గందరగోళం నెలకొంది. దేశంలోని పలు రాష‍్ట్రాల్లో లింగ నిష్పత్తిపై నీతి ఆయోగ్‌ ( సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ - ఎస్‌ డీజీ) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నీతి ఆయోగ్‌ రిపోర్ట్‌లో 1000 మంది అబ్బాయిలకు  840 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 1000 మంది అబ్బాయిలకు 949 మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. కానీ తాజాగా సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ సర్వేలో మొత్తం 960మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. 

గత మూడేళ్లుగా నీతిఆయోగ్‌ ఎస్‌డీజీ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్‌కు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్‌కు ఒక్క ఏడాది సమానంగా లేదు, "నాకెందుకో నీతి ఆయోగ్‌ రిపోర్ట్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఆర్‌ఎస్‌ రిపోర్ట్‌లో సైతం దేశంలోనే లింగ నిష్పత్తిలో మంచి ఫలితాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉందని విషయాన్ని స్పష్టం చేసిందంటూ" మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య అన్నారు.

అయితే నీతి ఆయోగ్‌ కేంద్ర (గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ) ఆధారంగా లింగ నిష్పత్తి రిపోర్ట్‌ ను విడుదల చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చెప్పిన వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్‌ విడుదల చేస్తుంది. మరి నీతి ఆయోగ్‌ తయారు చేసిన రిపోర్ట్‌ కరెక్ట్‌ గా ఉందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. 

చదవండి: అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top