"దీదీ మీరు ఓడిపోలేదు".. అఖిలేష్‌ యాదవ్‌ | didi you have not lost akhilesh yadav meets mamata | Sakshi
Sakshi News home page

"దీదీ మీరు ఓడిపోలేదు".. అఖిలేష్‌ యాదవ్‌

May 7 2026 6:11 PM | Updated on May 7 2026 7:18 PM

 didi you have not lost akhilesh yadav meets mamata

కోల్‌కతా: సమాజ్‌వాద్‌ పార్టీ అధినేత  అఖిలేష్ యాదవ్‌ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి భావోద్వేగ మద్దతు ప్రకటించారు. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వినూత్న రీతిలో పోరాటం చేసిందన్నారు. ఈ రోజు (గురువారం) కోల్‌కతాలోని ఆమె మమతా బెనర్జీ నివాసంలో ఆమెను పరామర్శించారు.

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ కేవలం  80 సీట్లకు  మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనని అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని పట్టుబడుతుంది. ఈ ఉ‍ద్రిక్తతల నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.

దీదీ మీరు ఓడిపోలేదు. మీరు, అభిషేక్ బెనర్జీ కలిసి అద్భుతమైన పోరాటం చేశారు అని అఖిలేష్ ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియా ఎదుట మాట్లాడుతూ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు  చేయడం ద్వారా లక్షలాది మంది ఓటు హక్కును తొలగించి, ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయన్నారు. బెంగాల్‌లో బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర బలగాల సమక్షంలోనే ఎన్నో  అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

బెంగాల్ వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని, మమతా బెనర్జీ ఆ కూటమిలో కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement