కరోనా: కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Delhi High Court: Why Rapid Testing When False Negatives High - Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షల నేపథ్యంలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ పరీక్షల్లో అధికంగా తప్పుడు ఫలితాలు వెల్లడవుతున్నప్పటికీ ఇంకా రాపిడ్‌ టెస్టులనే ఎందుకు నిర్వహిస్తున్నారని ఢిల్లీ హైకోర్టు ఆప్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక కరోనా పరీక్షల విధి విధానాల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అంతేగాని తమ సొంత నిర్ణయాలను కాదని స్పష్టం చేసింది. (ప్రియాంక గాంధీని డిన్నర్‌కు పిలిచిన బీజేపీ ఎంపీ )

దేశ రాజధానిలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) నిర్వహించిన సెరో సర్వేలో రాష్ట్రంలోని 22.86 శాతానికి పైగా ప్రజలు కరోనా బారిన పడినట్లు హైకోర్టు ప్రస్తావించింది. అలాగే వారికి లక్షణాలు లేకపోవడంతో బాధితులకు ఆ విషయం కూడా తెలియడం లేదని సూచించింది. ఇలాంటి పరిస్థితిల్లో ఢిల్లీ ప్రభుత్వం రాపిడ్‌ పరీక్షలతో ఎలా ముందుకు పోతుందని జస్టిస్‌ హిమా కోహ్లీ, సుబ్రమోనియం ప్రసాద్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. అంతేగాక వీటి ఫలితాల రేటు కూడా ఎక్కువగా  తప్పుగా వెల్లడవడంతో ఇంకా ఎలా చేస్తున్నారని నిలదీసింది. ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పలేదని తెలిపింది. కేవలం కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే రాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేస్తోందని హైకోర్టు గుర్తు చేసింది. (కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top