CDS Bipin Rawat: బిపిన్‌ రావత్‌.. మాటలు కూడా తూటాలే 

Deceased CDS Bipin Rawat Strong Counter To Opposition Nations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రావత్‌ శత్రుదేశాలపై నిర్మొహమాటంగా మాటలు సంధించేవారు. ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడేవారు. ఆ వాగ్భాణాల్లో మచ్చుకు కొన్ని... 

‘చైనా, పాకిస్తాన్‌ల దురాక్రమణ కాంక్ష భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తోంది. సరిహద్దులతో పాటు... తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా గట్టి నిఘా అవసరం. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నపుడు... ఎటువైపు నుంచి యుద్ధం మొదలవుతుందో ... అది ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే.’

‘పాక్‌తో చైనా స్నేహం, జమ్మూకశ్మీర్‌పై డ్రాగన్‌ వైఖరిని బట్టి చూస్తే వారిది భారత్‌ వ్యతిరేక అనుబంధంగా అభివర్ణించొచ్చు.’

‘చైనా ధనబలాన్ని, వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని ఇరుగుపోరుగు దేశాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.’

‘పాక్‌ను నియంత్రించాల్సిన అవసరం లేదు. అదే క్రమేపీ తమ దేశంపై పట్టు కోల్పోతోంది. దానికోసం మనం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారే కొంపను అంటించుకునే క్రమంలో ఉన్నారు.’

‘మిత్రులను సంపాదించుకోవడం తేలికే. కాని శత్రువులే మనను నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చేస్తారు’.

చదవండి: 
హెలికాఫ్టర్‌ దుర్ఘటన: మృత్యువుతో పోరాడుతున్నకెప్టెన్‌ వరుణ్‌!

ప్రముఖులను కబళించిన హెలికాప్టర్‌ ప్రమాదాలు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top