ఆర్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగినే బురిడీ కొట్టించిన కేటుగాడు!

Cyber Fraudster Duped A Retired RBI Employee On Pretext The Text KYC Upgradation - Sakshi

ముంబై: ఇటీవల కాలంలో చాలా రకాల సైబర్‌ మోసాలను చూశాం. కానీ చాలా వరకు చదువుకున్నవారు, గృహిణులు, రిటైర్డ్‌ ఉద్యోగలు మోసపోవడం చూశాం. అచ్చం అలానే  ఇప్పుడు తాజాగా ఒక ఆర్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి ఆన్‌లైన్‌ సైబర్‌ మోసానికి గురైంది.

(చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్‌ జ్వరాలు!!)

అసలు విషయంలోకెళ్లితే...70 ఏళ్ల ఆర్‌బీఐ రిటైర్డ్‌ మహిళా ఉద్యోగికి కేవైసీ అప్‌గ్రేడేషన్ కోసం హెచ్చరిస్తూ ఎస్‌బీఐ నుంచి ఒక టెక్స్ట్‌ మెసేజ్‌ వచ్చిందని భావించింది. దీంతో ఆమె ఆ మెసేజ్‌లో వచ్చిన నెంబర్‌కి కాల్‌ చేస్తే సదరు వ్యక్తి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారిగా రాహుల్‌గా పేర్కొంటాడు. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం కేవైసీ ఆన్‌లైన్ అప్‌గ్రేడేషన్‌కి సంబంధించిన ఒక కొత్త సేవను బ్యాంక్ ప్రారంభించిందంటూ నమ్మబలుకుతాడు.

దీంతో ఆమె అతను పంపించిన వెబ్‌ లింక్‌ని ఓపెన్‌ చేసి చూస్తుంది. అయితే ఆ వెబ్‌ పేజి ఎస్‌బీఐ లోగోతో సహా ఉండటంతో ఆమె పూర్తిగా అతన్ని నమ్మి ఆ వెబ్‌పేజ్‌లో తన పూర్తి వివరాలు, బ్యాంక్‌ అకౌంట్‌తో సహా నమోదు చేస్తుంది. ఇక అంతే ఏకంగా ఆరు లావాదేవీల్లో ఒక్కసారిగా రూ 3 లక్షలు పోయినట్లు గుర్తించి వెంటనే ఆమె బ్యాంక్‌కి కాల్‌చేసి కార్డుని బ్లాక్‌ చేయిస్తుంది. ఆ తర్వాత బాధితురాలు చితల్‌సర్ మాన్‌పాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top