‘పరిపూర్ణత్వానికి దగ్గరగా కొలీజియం’

Collegium system of appointment of judges near perfect model - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం పరిపూర్ణత్వానికి(పర్‌ఫెక్ట్‌ మోడల్‌) దగ్గరగా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ చెప్పారు. న్యాయ వ్యవస్థలో నియామకాలు, సంస్కరణలపై సీజేఏఆర్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో జడ్జీల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించడం వెనుక కఠినమైన ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కొలీజియంను కాపాడుకొనేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొలీజియంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల మధ్య వివాదం రగులుతున్న నేపథ్యంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top