హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... రోమాలు నిక్కబొడిచే వీడియో! | Sakshi
Sakshi News home page

హఠాత్తుగా నాగుపాము తిరగబడితే...

Published Tue, Oct 17 2023 10:58 AM

Cobra Attack Video Missed the Target While Shooting - Sakshi

ఎటువంటి కర్మకు అటువంటి ఫలితమే వస్తుందని అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో దీనికి రుజువుగా మారింది. వీడియోలోని దృశ్యం ప్రకారం.. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్‌తో నాగుపాముకు గురిపెట్టి కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మరుసటి క్షణంలో కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. 

వీడియో ప్రారంభంలో ఒక కింగ్ కోబ్రా(నాగు పాము) మట్టి రహదారిపై ఉండటాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఒక కారు ఆ కోబ్రా ముందు ఆగి ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న వ్యక్తి తన రివాల్వర్‌ని తీసి, కోబ్రాపై కాల్పులు జరుపుతాడు. ఆ వ్యక్తి  పలుమార్లు నాగుపాముపై కాల్పులు జరుపుతాడు. అయితే ప్రతిసారీ గురి తప్పుతుంది. 

ఆ నాగుపాము కోపంతో తన పడగ విప్పి, ఆ వ్యక్తిపై దాడికి ఉపక్రమిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడం వీడియోలో వినిపిస్తుంది. దీంతో వీడియో ఎండ్‌ అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Instantregretss అనే ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లెక్కకు మించిన వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు.
ఇది కూడా చదవండి: చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement