కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే! | Cheetah Suraj Dies Kuno National Park Eighth Five Months | Sakshi
Sakshi News home page

కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే!

Jul 14 2023 6:38 PM | Updated on Jul 14 2023 6:48 PM

Cheetah Suraj Dies Kuno National Park Eighth Five Months - Sakshi

భోపాల్: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో మరొకటి(సూరజ్‌) శుక్రవారం మృత్యువాత పడింది. గడిచిన ఐదు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 7 చిరుత పులులు చనిపోగా సూరజ్ మృతితో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. దాని వయసు నాలుగు సంవత్సరాలు.  

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత పులులు ఒక్కొక్కొటిగా మృత్యువాత పడుతూ వచ్చాయి. నాలుగు రోజుల క్రితం మగ చిరుత తేజాస్ చనిపోయిన సంఘటన మరిచిపోక ముందే సూరజ్ చనిపోవడం కునో జాతీయవనం వర్గాలను కలవరపెడుతోంది. సూరజ్ మరణానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

అంతకుముందు ఆడ చిరుత సియాయ(జ్వాల) నాలుగు చిరుత కూనలకు జన్మనివ్వగా అందులో రెండు చనిపోయిన సంగతి తెలిసిందే. అవి డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాయని జాతీయ వనం సిబ్బంది తెలియజేశారు. తేజాస్ మాత్రం కొట్లాటలో గాయపడి చనిపోయింది. సూరజ్ మరణంతో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో మొత్తం ఎనిమిది చనిపోగా కూనో నేషనల్ పార్కులో ప్రస్తుతం పది చిరుతలు మాత్రమే మిగిలున్నాయి.

ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement